కాళేశ్వరం(కులేశ్వరం) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఉపయోగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుతూ అధిక పంటలు సాగు చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నేడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్ హౌస్ నుండి పంట సాగు కోసం వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం (కులేశ్వరం) ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఉపయోగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుతూ దేశంలోనే అత్యధిక పంటలను సాగు చేస్తున్నామని చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రజలకు ఉపయోగపడలేదని, ఈ విషయాన్ని NDSA కూడా నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు.
నేడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్ హౌస్ నుండి పంట సాగు కోసం వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయించారు. మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు అధికారులు సమయానికి స్పందించి, సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ నీటి విడుదలను చేపట్టారు.
వరద కాలువ ద్వారా నీరు దిగువ ప్రాంతాలకు చేరుతుండడంతో ఆ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని రైతులు భావిస్తున్నారు. అధికారులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిర్ణయం వల్ల చొప్పదండి నియోజకవర్గ రైతులకు ఉపశమనం కలగడమే కాకుండా, సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీశ్, తాజా మాజీ ఎంపీపీ, జిల్లా ఉపాధ్యక్షులు కొల్ల రమేష్, ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు దావా అనంతరెడ్డి, వీర్ల నర్సింగరావు, నరేందర్ రెడ్డి, మొయిజ్, ఎమ్మార్వో రాజమల్లయ్య, ఎంపీడీవో రాజేశ్వరి, నాయకులు కత్తి మధు, మనీష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజమ్, రామ్ రెడ్డి, స్వామి, ఈశ్వర్, వెంకటేష్, పోచయ్య, లక్ష్మణ్, వేణు, 23 గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












