నిర్మల్, 28 July
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలను మార్చుకునేలా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విపత్తులు సంభవిస్తే వెంటనే స్పందించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.












