Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు వరదకాల్వ, నారాయణపూర్ రిజర్వాయర్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్‌రోడ్ వద్ద రైతులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
చొప్పదండి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు వరదకాల్వ, నారాయణపూర్ రిజర్వాయర్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్‌రోడ్ వద్ద రైతులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రైతుల సంక్షేమం పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంపులను ప్రారంభించి, అన్నారం–సుందిళ్ల–ఎల్లంపల్లి మార్గం ద్వారా మిడ్ మానేరు, వరదకాల్వలకు నీటిని విడుదల చేయాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరదకాల్వ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని, ప్రస్తుతం చుక్క నీరు లేక 60–70 కిలోమీటర్ల పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. కాల్వపై ఆధారపడి సాగు చేసే రైతులు మోటార్లు నడపలేక పొలాలను పడావుగా వదిలే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనులను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చొప్పదండి నియోజకవర్గంలోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు.
రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత సముద్రాల ఓంకార్‌తో పాటు పలువురు రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.












