యాదాద్రి భువనగిరి, 29 July
జీవితంలో కష్టాలు ఎదురైనా, కలలు చెదిరిపోయినా స్నేహితుడే ధైర్యంగా నిలిచే వేదిక అని, వారి తోడు చీకటిలో వెలుగు కిరణం వంటిదని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి తన కవితలో పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆమె తన భావాలను పంచుకున్నారు.
జీవితం నన్ను వదిలేసినా నీవు వదలని నీడవు, పగిలిన కలల మధ్య నిలిచిన ధైర్యపు వేదికవు. నాకేంటి, నా మిత్రుడున్నాడు అన్న మాటే జీవనం. అది చాలు చీకటిలో వెలిగే చిన్న దీప కిరణం.
దూరం ఉన్నా దగ్గరగా నిలిచే నీ మౌన హస్తం, కష్టాల కడలిలోనూ నడిపించే నమ్మక నేస్తం. మాటలకన్నా ముందే అర్థమయ్యే భావం, స్వార్థం లేని స్వచ్ఛమైన దీపం.
నీ మౌన హస్తం తాకిన ప్రతి క్షణం కష్టాల సముద్రంలో దిక్సూచి అవుతుంది. ఈ స్నేహితుల దినమున మనసు మౌనంగా చెబుతోంది... నీవు ఉన్నావంటేనే నా లోకం ఇంకా బతుకుతోంది.
వెన్నెలకు చల్లదనం ఎంత సహజమో, జీవితానికి స్నేహం అంత అవసరం. నవ్వుల్లోనూ, నిశ్శబ్దాల్లోనూ తోడుండే మిత్రులందరికీ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ రచన మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంజుల పత్తిపాటిది. ఆమె చరవాణి 9347042218.











