మిర్యాలగూడ, జూన్ 27
మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి శనివారం పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుమిత్ర, చీదళ్ల అనంతరాములు అండ్ సన్స్, యొద సీడ్స్ షాపుల్లో వరి విత్తనాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాల విత్తనాలున్నాయని ఆమె తెలిపారు.
మిర్యాలగూడ పట్టణంలోని వివిధ విత్తనాల దుకాణాలను మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని రైతుమిత్ర దుకాణం, చీదళ్ల అనంతరాములు అండ్ సన్స్ షాపు, యొద సీడ్స్ షాపులో ఉన్న వరి విత్తనాలను ఆమె పరిశీలించారు. ఆయా దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించిన 7 వరి రకాల విత్తనాలున్నాయని తెలిపారు. వరి విత్తనాల శాంపిల్స్ సేకరించి, వాటిని సీడ్స్ టెస్టింగ్ లేబరెటరికి పంపిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వరి విత్తనాలను, ముఖ్యంగా ఎమ్మార్పికి విక్రయించాలని కోరామని తెలిపారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.












