నిర్మల్, 5 September
ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో చేపూరు క్షత్రియ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో 11 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
*ఇస్కాన్ భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో క్షత్రియ విద్యార్థుల ప్రతిభ:* ఈ రోజు ఆర్మూర్ ఇస్కాన్ వారిచే నిర్వహించబడిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కార్యక్రమంలో క్షత్రియ పాఠశాల చేపూర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మతి డా॥ విజయలక్ష్మి తెలియజేసినారు. భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో అన్షిత్, హనీష్, శ్రీ చైత్ర, ,మోక్షిత్, శ్రీ లక్ష్మి తో 11 మంది చిన్నారులు విజేతలుగా నిలిచినట్లు తెలియజేసినారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను క్షత్రియ విద్యాసంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని పేర్కోన్నారు.












