పోచంపల్లి, 4 September
మండలం కనుముకుల గ్రామంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కోట మల్లారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి మల్లారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.
కోట మల్లారెడ్డి అంత్యక్రియలకు హాజరైన జగదీశ్ రెడ్డి మండలం కనుముకుల గ్రామంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కోట మల్లారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరై కోట మల్లారెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోట మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, సీనియర్ నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











