Guntur/Phirangipuram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNVST) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్, పరీక్ష తేదీల (టెంటెటివ్ షెడ్యూల్) వివరాలను నవోదయ విద్యాలయ సమితి (NVS) విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పరీక్షలు మొదటి దశలో డిసెంబర్ 2026లో జరుగుతాయి.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNVST) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్, పరీక్ష తేదీల (టెంటెటివ్ షెడ్యూల్) వివరాలను నవోదయ విద్యాలయ సమితి (NVS) విడుదల చేసింది. రాష్ట్రాలు, వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి దశ (Phase 1) పరిధిలోకి వస్తాయి.
షెడ్యూల్ ప్రకారం, అధికారిక నోటిఫికేషన్ జూలై 2026లో విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు కూడా జూలై 2026లోనే ప్రారంభమవుతాయి, ఆగస్టు 2026 చివరి తేదీగా ఉంది. దరఖాస్తుల దిద్దుబాటుకు ఆగస్టు 30, 2026 వరకు, హాల్ టికెట్ల విడుదల నవంబర్ 2026లో ఉంటుంది. ఫేజ్-1 ప్రవేశ పరీక్ష డిసెంబర్ 2026లో, ఫేజ్-2 పరీక్ష ఏప్రిల్ 2027లో జరుగుతాయి. ఫలితాలు మార్చి/మే 2027లో వెలువడతాయి.
పరీక్ష సమయం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 01:30 వరకు (2 గంటలు) ఉంటుంది. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. తాజా అప్డేట్ల కోసం NVS అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.











