నిర్మల్, 5 September
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విశ్వ హిందూ పరిషత్ సారంగాపూర్ ప్రఖండం ఆధ్వర్యంలో, పాఠశాల, కళాశాలల ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రిన్సిపాల్‌ను ఘనంగా సన్మానించారు.
ప్రిన్సిపాల్‌కు ఘన సన్మానం సారంగాపూర్: దేవుని తర్వాత గురువే దైవమని, విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపన దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విశ్వ హిందూ పరిషత్ సారంగాపూర్ ప్రఖండం ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రిన్సిపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ప్రఖండ సారంగాపూర్ అధ్యక్షుడు ఇర్గదిండ్ల సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. భజరంగ్ దళ్ సారంగాపూర్ అధ్యక్షుడు గాంధారి రవితేజతో పాటు సభ్యులు రజినీకాంత్ గౌడ్, దొడ నరేష్, దొడ దినేష్, శ్రీధర్, సతీష్, శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.












