.ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై.. నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
మిర్యాలగూడ ఆగస్టు 7 (మనోరంజని తెలుగు టైమ్స్)
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ
(యు.ఎస్.పి.సి) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.మిర్యాలగూడ మండలం అన్నారం బి ఉన్నత పాఠశాల, అడవిదేవులపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, కొండమల్లేపల్లి హై స్కూల్, జప్తి వీరప్పగూడెం హై స్కూల్, చెన్నై పాలెం హై స్కూల్, బొత్తలపాలం ప్రాథమికోన్నత పాఠశాల, అన్ని ప్రభుత్వ పాఠశాలలో భోజన విరమణ సమయంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగాఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ
నాలుగు దశల ఉద్యమ కార్యక్రమంలో భాగంగా
ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలనుపరిష్కరించాలన్నారు.పి.ఆర్.సి. నివెంటనేప్రకటించాలని, పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. విద్యాశాఖలో పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని , రేషనలైజేషన్ జీవో 25 సవరించాలని తదితర డిమాండ్ల పరిష్కారం లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించేంతవరకు ప్రతిరోజుశాంతియుతంగా భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమంచేపడతామని హెచ్చరించారు.












