ఏలూరు, 4 September
విద్యార్థి దశలో గురువుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదని నేషనల్ ట్రావెల్స్ జర్నలిస్ట్ ధనియాల ప్రభుదాస్ అన్నారు. తన జీవితంలో మురళి టీచర్ వంటి గురువుల బోధనలు, నీతి నిజాయితీగా బ్రతకడం నేర్పాయని, అది తనను సమాజ సంస్కరణలో కీలక పాత్రికేయునిగా నిలిపిందని ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులు ప్రోత్సాహం. నేషనల్ ట్రావెల్స్ జర్నలిస్టు స్థాయికి *ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు.* *విద్యా-బుద్ధులు నేర్పిన గురువులను ఎప్పటికి మరువకండి.* *ఆశయాల అశ్వమెక్కించి-విజయ తీరాలకు చేర్చే దిక్సూచీలు గురువులు.* విద్యార్థి గురువును ఏ స్థాయిలో ఉన్నా మరిచి పోకూడదు.దానికి కారణం విద్యార్థి పాఠశాలలో అడుగు పెట్టినప్పుడు నుంచి వారి పూర్తి బాధ్యత లను తల్లిదండ్రులుగా మన గురువులు తీసుకుంటారు. ఆట-పాటల,అల్లరి వయ సు నుండి మనకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడే వరకు మన ఉపాధ్యాయు లు మన చదువు,సంస్కా రం,క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా మనలో ఒక మంచి సంఘ సంస్కర్తను రూపొందిస్తారు.ఈ విశాల ప్రపంచంలో మనిషి సంఘ జీవిగా బ్రతుకుతున్న నేపథ్యంలో ఉపాద్యాయు లు మనల్ని ఈ సమాజాని కి,సంఘానికి అవసరమైన వ్యక్తిగా పలు రంగాల వైపు విద్యార్థులను ప్రోత్సహించి జాతి మనుగడకు ఉపా ద్యాయులు జాతి నిర్మాత లుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఒక స్థాయిలో ఉన్న ప్రతివ్యక్తి వెనుక విద్యా- బుద్ధులు నేర్పిన ఉపాద్యా యులు లేకుండా ఏ వ్యక్తి తనంతట తానుగా ఎదగ లేరు.తల్లిదండ్రులు,గురువులు దైవంగా ప్రాధాన్యత కల్పించే మనం, తల్లిదండ్రు ల ఋణమైనా తీర్చుకో గలం కానీ...గురువుల రుణం తీర్చుకోవడం ఏమంత ఈజీ కాదు.ఈ రోజున మనం పదిమంది లో మాట్లాడుతున్నాం అంటే ఆ గొంతుక వెనుక ఉన్న బలం ఉపాధ్యాయు లు,విమానాల్లో ఎగిరి వెళ్ళి విదేశాల్లో పెద్ద-పెద్ద ఉద్యో గాలు చేస్తున్నామంటే దాని కారణం మనకు విద్య నేర్పి న గురువులు ఇలా చెప్పు కుంటూ పోతే విద్య,వైద్యం. క్రీడలు,శాస్త్ర సాంకేతిక ఇతర రంగాల్లో మనం ఒకటేమిటి ఈ సమాజంలో ప్రతి రంగంలో ఒక ఉన్నత స్థానంలో మనుగడ సాగిం చడానికి మన వెనుక ఉంది మన ఆచార్యులు. అన్ని రంగాలలో విద్యార్థులు ఉన్నారు.వీట న్నిటికీ కారణం ఉపాధ్యా యులు.ఇట్లాంటి ఉపాధ్యా యులను మనలో చాలా మంది గుర్తుపెట్టుకోలేక పోతున్నాం.మనం చదివిన పాఠశాలను విడిచిపెట్టి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి పోయినా...వారింకా ఎంతో కాలంగా మనలాంటి వారికి విద్యా-బుద్ధులు నేర్పేందు కు మన పాఠశాల ఉపా ధ్యాయులుగా మనలాంటి ప్రయోజకులను తయారు చేస్తూనే ఉన్నారు.మనం మాత్రం ఇంత ఎత్తుకు ఎది గి కనీసం ఇలాంటి ఉపా ధ్యాయ దినోత్సవం రోజైనా వారితో మాట్లాడదాం. టీచర్ గారండి మీరు నేర్పిన చదువు వల్ల నేను ఒక స్థాయిలో ఉన్నాను అని చెబుదాం. మన ఉన్నతమైన స్థానం కోసం ఎందరి కృషి ఉన్నా ప్రధా నంగా చెప్పుకోవలసింది కూడా మన టీచర్లనే... నా విషయంలో ప్రధానం గా చెప్పుకోవలసిన ఉపా ధ్యాయుల్లో ఒకరు మురళి టీచర్.నేను వారి దగ్గర విద్యార్థిగా శిక్షణ తీసుకోక పోయినా వారి మాటలలో నేను నేర్చుకున్న పాఠాలు నీతి నిజాయితీగా బ్రతక డం అనేది నేర్చుకున్నాను. ఆమె చెప్పిన నీతి బోధన లు నన్ను ఈ రోజున ఈ సమాజ సంస్కరణ చేసే వారిలో ప్రధానమైన వ్యక్తి పాత్రికేయునిగా నిలిపింది. ఎవరైనా తప్పు చేస్తే నిల దీసి,నిగ్గు తేల్చే వాయిస్ 'ప్రశ్న', ప్రశ్నించే వ్యకిగా నిలబెట్టారు.అందుకే ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నా, మనం విద్య నేర్చుకుని పాఠశాల విడిచి వెళ్లిపోయి నా మనల్ని మంచి మార్గం లో పెట్టే ఉపాధ్యాయుల ను ఖాళీగా ఉన్న సమయం లో ఏదో ఒక సారీ అయినా పలకరించండి. మన నుండి వారు ఏమీ కోరుకోరు.నా విద్యార్థి ఇంతగా ఎదిగాడు, వాడు గొప్పవాడు అయ్యా డు అని సంతోషిస్తారు. ఎంతలా అంటే మన ఎదుగుదల వెనుక వారు ఉన్నా వీడు ఎదగడానికి నేనే కారణం అనే ఆలోచన లేకుండా మనల్ని చూస్తూ ఆనంద భాష్పాలతో పట్టరా ని సంతోషం బయటకు కనిపించకుండా ఉద్వేగంతో ఉంటారు.మిత్రులారా... కనీసం ఈ రోజు అనేది ఉపాద్యాయుల దినోత్సవం వారికి కేటాయింపు చేయబడింది.వారితో ఒక్క నిమిషం మనం మాట్లాడదాం.వారిని పల కరించుదాం.ఆ పలకరింపు వారికి మనం ఇచ్చే అతి పెద్ద బహుమానం.అదే వారికి మనం ఇచ్చే సంతోషం.ఎందుకంటే వారికి మనం ఇవ్వగలిగిన వారు మననుండి పొంద గలిగిన ప్రతిఫలం ఇదే కాబట్టి.దయచేసి ఉపా ధ్యాయులను గౌరవించండి గుర్తుపెట్టుకోండి.తీర్చుకోలేని ఋణాను బంధం గురు శిష్యుల బంధం. *ధనియాల ప్రభుదాస్.* నేషనల్ ట్రావెల్స్ జర్నలిస్ట్ 9059011209 *ఏలూరు*












