బజార్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలమయ్యారని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు.
*కేసీఆర్ రాజీనామా చేయాలని, బజార్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ* *ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ విఫలం... వెంటనే రాజీనామా చేయాలి: ఆడే గజేందర్* *కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే అనిల్ జాదవ్ ఖబడ్దార్... : బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్* *గత 10 సంవత్సరాల్లో అనిల్ జాదవ్ నీ ఊరిలోనే ఒక్క డబుల్ బెడ్రూం అయిన తెచ్చావా... ఇప్పుడు నీ ఊరులో నిర్మాణంలో ఉన్న ఇళ్ళు కెసిఆర్ ఇచ్చినాయ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినాయ... చెప్పు - ఆడే గజేందర్* *శుక్రవారం బజార్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ గారితో కలిసి ఆడే గజేందర్ గారు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ప్రజల మధ్యకు రాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు* *ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని సలహాలు ఇచ్చే బాధ్యతగా వ్యవహరించలేకపోతున్నారని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ విమర్శించారు. కేసీఆర్ వెంటనే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. “కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అనిల్ జాదవ్.. మా కార్యకర్తలకు అండగా నేను ఎప్పుడూ ఉన్న” అని ఆడే గజేందర్ గారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళెం విఠల్,ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య,మాజీ మండల అధ్యక్షుడు జెల్కే పాండురంగ్,మండల ఉపాధ్యక్షుడు రాథోడ్ రమేష్,ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొమ్మెత నర్సయ్య, మాజీ జడ్పీటీసీ మునేశ్వర్ నారాయణ,నాయకులు జంగుబాపు, శివుడు,అరే పండు, డీసీసీ కార్యదర్శి దీసి విజేందర్,గణేష్ జాదవ్,బత్తిని కిషన్,కనిందే మాధవ్,ప్రధాన కార్యదర్శి గొల్లనాగు రమేష్,సమ సురేష్ రెడ్డి, పోరెడ్డి నారాయణ,సర్పంచ్లు రజాక్, కృష్ణకత్ రెడ్డి,యువ నాయకులు సయ్యద్ సల్మాన్, శరత్,రాజు,సన్నీ,రవి తదితరులు పాల్గొన్నారు*











