కడం (పెద్దూర్), 5 September
ఉపాధ్యాయ దినోత్సవంలో పురస్కరించిన వార్డెన్ రాంజీగారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాంజీగారి పాదాలను కడిగి, తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కడం యు పి యస్ పాఠశాలలో పదవీ విరమణకు చేరువలో ఉన్న వార్డెన్ రాంజీ గారిని ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఎం మదిరె ముత్యం గారి చొరవతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు రాంజీ గారి పాదాలను కడిగి, తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల పట్ల ఆప్యాయతతో ఉంటూ, పాఠశాలలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా అందరు కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి, విద్యార్థులు, సిబ్బంది నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం మదిరె ముత్యం, ఉపాధ్యాయులు ఎనుగంటి శ్రీనివాస్ గౌడ్, కిషన్, ఏఎన్ఎం మౌనిక, ఐసీటీ దివ్యతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












