** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న రైతులు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిఫై సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో పొగాకు రైతులు రాస్తోరోకో చేపట్టారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రైతులు నిరసన తెలిపారు. పోలీసులు రైతులను, రైతు నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో రహదారిపై పెద్దయెత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థ ఎస్టిసి ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిలోకు రూ.200 కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని సూచించినా అమలు కాలేదన్నారు. 'నో బిడ్', 'లో బిడ్' రాకుండా పలు సమీక్షలు నిర్వహించినా కంపెనీలు తమ ఇష్టానుసారమే కొనుగోళ్లు చేశాయని విమర్శించారు. దీంతో ఒక్కో బారెన్కు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
95 మిలియన్ కిలోల ఇండెంట్ పొందిన ఐటీసీ వంటి కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే ప్రైవేట్ కంపెనీల ద్వారా సగటున కిలోకు రూ.250 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రూ.1000 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా తక్షణ కార్యాచరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.












