హైదరాబాద్, జులై 12
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆపార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన వెయ్యి అభ్యంతరాలను తమకు పంపాలని, అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా సమాధానం ఎలా చెప్పగలమని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘా న్ని ఆపార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ రాశారు. పార్టీ రిజిస్ట్రే షన్ ను వ్యతిరేకిస్తూ వచ్చిన వెయ్యి అభ్యంతరాలను తమకు పంపాలని కోరారు. అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా సమాధానం ఎలా చెప్పగలమని ఆయన ప్రశ్నించారు.
దేశంలో ఒకే రకమైన పేర్లతో వందలాది పార్టీలు ఉన్నప్పుడు, తమ పార్టీ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని కవిత అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద ప్రతిపాదిత తెలంగాణ రక్షణ సేన పార్టీ గుర్తింపు దరఖాస్తును ఆమోదించి, నిష్పాక్షికమైన ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం తొలుత కేటాయించిన పేరుతోనే 105 నియోజకవర్గంలో పార్టీ జెండాలు ఎగరవేసామని, ఇప్పుడు పేరు మార్చమంటే అన్యాయమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో ఒకే రకమైన పేరుతో పలు పార్టీలకు గుర్తింపు ఇచ్చారని, తెలంగాణ రక్షణ సేన పార్టీ పైనే అభ్యంతరాలు ఎందుకని వారు ప్రశ్నించారు.












