తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
గత పదేళ్ల పాలనలో ముధోల్ నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు మంజూరు కాలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. తానూర్ మండలంలోని మసల్గా తండాలో ఇద్దరు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఆయన, అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
గత పది సంవత్సరాల పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ముధోల్ నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు మంజూరు కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు.
ఆదివారం తానూర్ మండలంలోని మసల్గా తండాలో ఇద్దరు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దశలవారీగా ఇందిరమ్మ ఇల్లాలు మంజూరు చేయించి, పేదోడి స్వంత ఇంటి కల నెరవేరేలా తన వంతుగా పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇందిరమ్మ ఇళ్లు పేదలకు మంజూరు అవుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని, అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు.
అదేవిధంగా, మారుమూల మండలమైన తానూర్ మండల కేంద్రంలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హామ్ పథకంలో 140 కోట్లతో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, తానూర్ నుండి తండా వరకు రోడ్లు వేయించడం జరుగుతుందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు మండల సర్పంచులు, నాయకులు, తండావాసులు ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.











