బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయన దీర్ఘాయుష్షును కాంక్షించారు.
బోథ్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కేక్ కట్ చేసి, రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో డైరెక్టర్ మునీశ్వర్ సొనల, బూర్గుల మల్లేష్, షేక్ నజర్, వార్డు సభ్యులు షేక్ షాకీర్, అబ్దుల్ హసీబ్, పన్నాల శమేందర్ రెడ్డి, అంజయ్య మల్యాల, బండారి అశోక్, కౌసర్, షంషుద్దీన్, లింబాజీతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.











