భైంసా, జూలై 12
భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు రూ.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
భైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని లబ్ధిదారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేద్మ బొజ్జు, ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భోస్లే నారాయణరావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











