నిర్మల్, జూలై 12
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాన్ని జాగ్రత్తగా నింపి ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించకపోతే ఓటరు జాబితాలో పేరు నమోదుపై సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాన్ని జాగ్రత్తగా నింపి ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ సూచించారు.
ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించకపోతే ఓటరు జాబితాలో పేరు నమోదుపై సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునే బాధ్యతతో వ్యవహరించాలని, ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొన్న ఆయన, ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే ఎన్నికల అధికారులను సంప్రదించాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను అధికారులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని గోవింద్ నాయక్ విజ్ఞప్తి చేశారు.











