ఆర్మూర్, 2024-07-12
ఆర్మూర్ పట్టణంలో ఎస్ ఎస్ కె మహిళా చిట్టి గ్రూప్ సభ్యులు, ఎస్ ఎస్ కె సమాజ్ అధ్యక్షుడు గటడి ఆనంద్, సెక్రెటరీ డీకే రాజేష్‌లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆనంద్ మహిళలకు అన్నింటా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఆర్మూర్ ఎస్ ఎస్ కె మహిళా చిట్టి గ్రూప్ సభ్యులు, ఎస్ ఎస్ కె సమాజ్ అధ్యక్షుడు గటడి ఆనంద్, సెక్రెటరీ డీకే రాజేష్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గటడి ఆనంద్ మాట్లాడుతూ, మహిళలకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటానని, రాబోయే రోజుల్లో వారికి 100% సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖాందేశ్ సంగీత, గటడి స్వాతి, డీజే సులోచన, గటడి జయశ్రీ, బచ్వాల్ శాంతి, బోచ్కర్ వీణ, గటడి శిరీషా, విద్యారాణి, ప్రమీల, గీత, లక్ష్మి, ప్రేమ, మధులత, వీణ, డీజే హేమలత, శీతల్, సునీత, జెస్సు లలిత, సత్పుతే మంజుల, అంజలి, గంగామణి తదితరులు పాల్గొన్నారు.












