బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
బోథ్ పట్టణ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను బోథ్ మండల కన్వీనర్ మేరుగు భోజన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన హెల్ప్ డెస్క్ నిర్వహణ, ఫారాల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు.
బోథ్ పట్టణ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా రెండు రోజులుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను బోథ్ మండల కన్వీనర్ మేరుగు భోజన్న పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ఐ నాగరాజు, బోథ్ గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్‌తో కలిసి హెల్ప్ డెస్క్ నిర్వహణ, ఇన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన సూచనలు, సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా మేరుగు భోజన్న మాట్లాడుతూ, ప్రతి అర్హులైన ఓటరు తమ ఇన్యూమరేషన్ ఫారాన్ని సకాలంలో సమర్పించి ఓటరు జాబితాలో తమ పేరు కొనసాగేందుకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.











