బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
గుడిహత్నూర్ మండలంలో కొనసాగుతున్న SIR ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు పరిశీలించారు. శాంతపూర్, గురుజా, ఉంబ్రి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, అధికారుల పనితీరును సమీక్షించారు.
గుడిహత్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న SIR ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తరఫున నియమితులైన మండల SIR అబ్జర్వర్ ఇన్చార్జ్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, అలాగే కాంగ్రెస్ పార్టీ గుడిహత్నూర్ మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని శాంతపూర్, గురుజా, ఉంబ్రి, తదితర గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సందర్శించి, అధికారుల పనితీరును పరిశీలించడంతో పాటు ప్రజలకు ఓటరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, చేర్పులపై అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మల్లెపూల సత్యనారాయణకు, మండల అధ్యక్షులు తొడసం దౌలత్ రావుకు శాలువాలతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు.
మల్లెపూల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. SIR ప్రక్రియను ప్రజలు బాధ్యతగా తీసుకుని పూర్తి సహకారం అందించాలని కోరారు.
తొడసం దౌలత్ రావు మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో SIR ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు శాంతపూర్ సర్పంచ్ సబ్లె పత్తు సింగ్, కరాడ్ బ్రహ్మానంద్, కరాడ్ విష్ణుకాంత్, శమెందర్, పోచార మాజీ సర్పంచ్ మల్లేష్, గోడం మోతిరం, రాధాకృష్ణ, ఉంబ్రి ఉప సర్పంచ్ ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ పెందూర్ జైరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLOలు, BLA-2లు పాల్గొన్నారు.












