లోకేశ్వరం, 6 July
వ్యవసాయంలో ఆరుద్ర కార్తె వర్షాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. 'ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం ఉండదని, ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయని' సామెతలున్నాయి. అయితే, ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక ఖరీఫ్ సాగు నెమ్మదించింది. నేటితో ఆరుద్ర కార్తె ముగియనుంది.
వ్యవసాయంలో ఆరుద్ర కార్తె వర్షాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. 'ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం ఉండదని, ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయని' సామెతలున్నాయి. అయితే, ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక ఖరీఫ్ సాగు నెమ్మదించింది.
గత ఏడాది జులై 4 నాటికి 5.01 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి కేవలం 1.93 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిగతా పంటల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. నేటితో ఆరుద్ర కార్తె ముగియనుంది. ఇకనైనా వరుణుడు కరుణించి సాగు విస్తీర్ణం పెరుగుతుందేమో చూడాలి.












