Hanumakonda/Hasanparthy (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సాయి మహేశ్వర ఫర్టిలైజర్, కిసాన్ సీడ్స్ ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ విధానం, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సాయి మహేశ్వర ఫర్టిలైజర్, కిసాన్ సీడ్స్ ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ విధానం, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, ఇతర రికార్డులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వళ్ళోజు వినోద్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరకే (ఎమ్మార్పి) విక్రయించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను ఎమ్మార్పికి విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం లేదా అక్రమ నిల్వలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వరి ఏడు సన్న రకాల సాగును రైతుల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. బీపీటీ-5204 (సాంబా మసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కెఎన్ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కెఎన్ఎం-7715 రకాలను ప్రోత్సహించాలని ఆదేశించారు.
విత్తనాల విక్రయాలకు సంబంధించిన వివరాలను సీడ్స్ ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని డీలర్లను ఆదేశించారు. రాబోయే కాలంలో ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలన్నారు.
తనిఖీల్లో మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి ఋషేంద్రమణి, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.









