మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. యాసంగి/ వానకాలం పెట్టుబడి సాయం కింద 'రైతుభరోసా' నిధుల విడుదలను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తోంది. తాజాగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది.
రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి/ వానకాలం పెట్టుబడి సాయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతుభరోసా' నిధుల విడుదల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది.
అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం వరుసగా నాలుగో రోజుకు చేరింది. తక్కువ భూమి ఉన్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, విడతల వారీగా అకౌంట్లలో డబ్బులు జమ చేసే ప్రక్రియను వ్యవసాయ, ఆర్థిక శాఖలు ముమ్మరం చేశాయి. మొదటి రోజు ఒకటి, రెండు ఎకరాల లోపు ఉన్న రైతులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. నిరంతరాయంగా సాగుతూ నేడు 5 ఎకరాల పరిమితి వరకు ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT ద్వారా) నగదు జమ అవుతుండటంతో రైతుల మొబైల్కు మెసేజ్లు వస్తున్నాయి.












