బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 02
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బోథ్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బోథ్ పట్టణంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆడే గజేందర్ పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోథ్ మండల కన్వీనర్ మేరుగు భోజన్న, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, బోథ్ BLO2 సూపర్వైజర్ షేక్ మొహమ్మద్, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, PACS డైరెక్టర్ చాట్ల ఉమేష్, ఆదిలాబాద్ జిల్లా స్పోక్ పర్సన్ పసుల చంటి, కాంగ్రెస్ నాయకులు మేరుగు నర్సింహాదాస్, అచ్యుత్ రెడ్డి, అబూద్, అబ్రార్, రహీంద్దీన్, శంషాద్దీన్, బుచ్చన్న, రవి, గడ్డల నారాయణ, రాజు రెడ్డి, అరుణ్ కుమార్, అసీఫ్, షేక్ షాకీర్, జగన్, మారుతీ, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.












