బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
బైంసాలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హిందువాహిని నాయకుడు ఆకుల రంజిత్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
బైంసాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హిందువాహిని నాయకుడు ఆకుల రంజిత్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆకుల రంజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువాహినిలో సుమారు 15 సంవత్సరాల పాటు పనిచేసిన రంజిత్ ఇకపై బీజేపీ వేదికగా ప్రజాసేవకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆయనకు పార్టీలోకి స్వాగతం పలుకుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










