సర్వేను (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
గోపాల్పేట్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ పంటల నమోదు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం పరిశీలించారు. పంటల వివరాలను డిజిటల్‌గా ఏ విధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గోపాల్‌పేట్‌లో డిజిటల్ పంటల సర్వే పరిశీలన నిర్మల్, సెప్టెంబర్ 3 ( గోపాల్పేట్ గ్రామంలో జరుగుతున్న డిజిటల్ పంటల నమోదు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం పరిశీలించారు. పంటల వివరాలను డిజిటల్‌గా ఏ విధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును, పంటల నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతు డిజిటల్ పంటల సర్వేలో భాగస్వామి కావాలని, తమ పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రైతు సర్వేలో పాల్గొని, గ్రామంలో పంటల నమోదు కోసం వచ్చే వాలంటీర్లకు సహకరించి తమ పంటల వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, ఏఈఓ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












