పద్ధతి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్ గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో వెదజల్లే లో వరి సాగు (డైరెక్ట్ సీడెడ్ రైస్ డిఎస్ఆర్) చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి మేకల ఋష్యేంద్రమణి రైతులకు సూచించారు. ఈ ద్వారా కూలీల కొరతను అధిగమించడంతో పాటు సాగు ఖర్చు, నీటి వినియోగం, సమయం ఆదా అవుతాయని తెలిపారు.
వెదజల్లే పద్ధతిలో వరి సాగుతో ఖర్చు, నీరు, సమయం ఆదా : ఎంఎఓఋష్యేంద్రమణి
మిర్యాలగూడ సెప్టెంబర్ 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్ గ్రామంలో ఆత్మ పొలంబడి ఫార్మ్ స్కూల్ ఆధ్వర్యంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు (డైరెక్ట్ సీడెడ్ రైస్ –డిఎస్ఆర్)చేసుకోవాలని మిర్యాలగూడ మండలవ్యవసాయాధికారి మేకల ఋష్ యేండ్ర మణి కోరారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై రైతులకు అవగాహన మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నారుమడి పెంచి నాట్లు వేసే విధానం లేకుండా, నేరుగా ప్రధాన పొలంలోనే వరి విత్తనాలను వెదజల్లడం లేదా వరుసలలో విత్తడం వెదజల్లే పద్ధతిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా కూలీల కొరతను అధిగమించడంతో పాటు ఎకరాకు సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, నీటి వినియోగం ఆదా అవుతుందని, నాట్ల ప్రక్రియలో సమయం ఆదా అవుతుందని వివరించారు. నేరుగా విత్తడం వల్ల మొక్కల వేర్లు నేలలోకి బలంగా చొచ్చుకుపోయి మొక్కలు బలంగా పెరుగుతాయని తెలిపారు. సాగు విధానం పొలాన్ని బాగా దున్ని, సమతలంగా చదును చేసి నీరు సమానంగా ఉండేలా భూమిని సిద్ధం చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలను విత్తన శుద్ధి చేసి, తగిన విధంగా నానబెట్టి మొలకలు వచ్చిన అనంతరం పొలంలో సమానంగా వెదజల్లాలి లేదా డ్రమ్ సీడర్ ద్వారా వరుసలలో విత్తుకోవచ్చన్నారు. పంటలో కలుపు నివారణకు సకాలంలో చర్యలు చేపట్టి, పంట అవసరాన్ని బట్టి నీటి తడులు అందించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కంపసాగర్ శాస్త్రవేత్త కె.సంధ్యా రాణి, ఆత్మ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బి టీఎం గిరి, ఎఇఓ ఎ.నాగయ్య, వృద్ధి ఇంపాక్ట్ సర్వీసెస్ ఎఫ్ఓ బి.సైదులు, జెఎఫ్ఓ కవిత, రైతులు చాపల అబ్బులు పాల్గొన్నారు.












