చించోలి(బి) గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వ్యవసాయ కార్యక్రమాలు, రైతుల పరిస్థితులపై పరిశీలన , సెప్టెంబరు 3 ( నిర్మల్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ భవేష్ మిశ్రా గురువారం మండలంలోని చించోలి(బి) గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించారు. రైతుల పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలకు చెందిన వ్యవసాయ విద్యార్థులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఆర్ఏడబ్ల్యూఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యకలాపాలు, రైతులతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్థులు వివరించారు.విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో కలిసి పనిచేయడం ద్వారా వ్యవసాయ రంగంపై ఆచరణాత్మక అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కళాశాల విద్యార్థులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
చించోలి(బి) గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- చించోలి(బి) గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వ్యవసాయ కార్యక్రమాలు, రైతుల పరిస్థితులపై పరిశీలన , సెప్టెంబరు 3 ( నిర్మల్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ భవేష్ మిశ్రా గురువారం మండలంలోని చించోలి(బి) గ్రామాన్ని సందర్శించారు.
- గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో కలిసి పనిచేయడం ద్వారా వ్యవసాయ రంగంపై ఆచరణాత్మక అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
- ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించారు.
- రైతుల పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాలకు చెందిన వ్యవసాయ విద్యార్థులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3226ఆర్టికల్స్
3,97,641వ్యూస్