సారంగాపూర్, 3 September
క్రాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం మండలం గోపాల్పేట్ గ్రామ శివారులోని పొలాల్లో కొనసాగుతున్న క్రాప్ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
క్రాఫ్ సర్వేను పకడ్బందీగా నిర్వర్తించాలి.జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా . నిర్మల్ జిల్లా, క్రాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం మండలం గోపాల్పేట్ గ్రామ శివారులో పొలాల్లో కొనసాగుతున్న క్రాప్ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, పంటల వివరాలు క్రాప్ సర్వేలో సక్రమంగా నమోదైతే భవిష్యత్తులో ధాన్యం విక్రయాలు, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సహాయం, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు పొందే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందికి అవసరమైన సహకారం అందించి, తమ పంటల వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. క్రాప్ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సిబ్బంది తప్పనిసరిగా రైతుల సమక్షంలోనే పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ సాగు వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా క్రాప్ సర్వేను పూర్తి చేసేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన స్థానిక యువతను వాలంటీర్లుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, నమోదు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంతెన గంగారెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, ఎంపీఓ అజీజ్ ఖాన్, సంబంధిత శాఖల అధికారులు,రైతులు పాల్గొన్నారు.












