Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
పంట కుంటలు (ఫార్మ్ పాండ్స్) నిర్మించుకోవడం ద్వారా సాగునీటి సమస్యను అధిగమించి పంటలను కాపాడుకోవచ్చని మామడ మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) లింగాల హరికృష్ణ అన్నారు. రాయదారి గ్రామంలో మంగళవారం రైతులకు ఫార్మ్ పాండ్స్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో కురిసే అదనపు వర్షపు నీటిని పంట కుంటల్లో నిల్వ చేసుకుంటే కరవు, నీటి ఎద్దడి పరిస్థితుల్లో పంటలకు అవసరమైన నీటిని అందించవచ్చన్నారు. నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడం ద్వారా సాగు వ్యయం తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశముందని వివరించారు.
రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఫార్మ్ పాండ్స్ నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి అనసూయ, ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.