నిర్మల్, జులై 20
ఖానాపూర్ మండలంలో పాకాల నుండి నీటి విడుదల, ఆరుతడి పంటలపై సమీక్ష కోసం అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులకు సంతృప్తికరమైన సమాధానం లభించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖానాపూర్ రైతు వేదిక వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది.
ఖానాపూర్ మండలంలో పాకాల నుండి నీటి విడుదల, ఆరుతడి పంటలపై సమీక్షలో భాగంగా నీటిపారుదల శాఖ, రెవిన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులకు అధికారులు చెప్పిన సమాధానం నచ్చకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖానాపూర్ రైతు వేదిక ముందు ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. దీనికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి, మాజీ జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్, నాజీతండా సర్పంచ్ బాలకృష్ణ, మంగళవారిపేట సర్పంచ్ గంధి నాగేశ్వరరావు, ధర్మారావుపేట సర్పంచ్, మనుమతుల గడ్డ సర్పంచ్ శ్రీలత అశోక్, కొత్తూరు మాజీ సర్పంచ్, రాగంపేట్ మాజీ సర్పంచ్, బుధరావుపేట ఉప సర్పంచ్ సింగు సుధాకర్, బిఆర్ఎస్ వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.












