ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆదిలాబాద్ నియోజకవర్గ SIR అబ్జర్వర్ శ్రీ కొట్నాక్ తిరుపతిని డీసీసీ అధ్యక్షులు డా నరేష్ జాదవ్ శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్, జిల్లా మైనారిటీ విభాగం చైర్మన్ సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గౌలి సంజీవ్ కుమార్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలతరావు, డీసీసీ సెక్రటరీ ఇమ్రాన్ బేగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












