మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని దూదిగాం గ్రామ సర్పంచ్ హారోను రషీద్ బాబా సూచించారు. దూదిగాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, దరఖాస్తుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని దూదిగాం గ్రామ సర్పంచ్ హారోను రషీద్ బాబా సూచించారు.
దూదిగాం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి రాజశేఖర్, గ్రామ రెవెన్యూ అధికారి గౌడ్, బీఎల్వోలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల పేర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు తదితర దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
గ్రామ ప్రజలు ఎస్ఐఆర్ దరఖాస్తులను సక్రమంగా పూరించి, బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ హారోను రషీద్ బాబా కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎల్వోలు రోజా, ప్రేమలత, లక్ష్మి, సోని, నీలేష్, వార్డు సభ్యుడు ముస్తఫా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.












