Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
దేశ యువత, విద్యార్థుల ఐక్య పోరాటమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల గళం ఎంత శక్తివంతమైనదో ఈ పరిణామం మరోసారి నిరూపించిందని తెలిపారు.
దేశ యువత, విద్యార్థుల ఐక్య పోరాటానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల స్వరం ఎంత శక్తివంతమైనదో ఈ పరిణామం మరోసారి నిరూపించిందని తెలిపారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, వారి భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను దేశ యువత ఎప్పటికీ సహించబోదని ఆయన పేర్కొన్నారు.
యువత ఆవేదన, విద్యార్థి సంఘాల ఆందోళనలను కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సురేందర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అధికార అహంకారానికి స్థానం లేదని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని ఏ ప్రభుత్వం అయినా ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పదని ఆయన అన్నారు. విద్యార్థుల హక్కులు, విద్యా రంగం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాడుతుందని స్పష్టం చేశారు.
గతంలో కూడా మోడీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించారని సురేందర్ గుర్తు చేశారు. రైతుల ఐక్య పోరాటం ముందు చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.












