ఖానాపూర్, జూలై 29
ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియ వంద శాతం పూర్తయిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ రాజురా సత్యం తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా జేకే నగర్, రాజీవ్ నగర్, విద్యానగర్ కాలనీలలోని 235, 236 పోలింగ్ కేంద్రాల్లోని ఓటరు జాబితా సవరణ పనులు విజయవంతంగా ముగిశాయి.
ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని జేకే నగర్, రాజీవ్ నగర్, విద్యానగర్ కాలనీలకు చెందిన 235, 236 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియ వంద శాతం పూర్తయిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ రాజురా సత్యం తెలిపారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి నిరంతరం మార్గనిర్దేశం చేసిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ఎన్నికల సిబ్బంది, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులు, వార్డు అధికారులు, కాలనీవాసులు, యువకులు, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాజురా సత్యం ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సహకారంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.











