బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా తాంసి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా తాంసి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రైతుల పట్ల తన నిబద్ధతను ముఖ్యమంత్రి చాటుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకుని రైతుకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రతి రైతు కుటుంబం అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఇచ్చోడ ఆత్మ కమిటీ అధ్యక్షుడు కౌడల నారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడల నారాయణ, తాంసి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్, ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచులు గంగాధర్, నాగిరెడ్డి, ఉప సర్పంచులు రామ్ రెడ్డి, నర్సింలు, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు వన్నెల నరేష్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, జిల్లా కార్యదర్శి రామన్న యాదవ్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ధనుంజయ్, ఆత్మ డైరెక్టర్ గంగయ్య, అనుపట్ల సంజీవ్, యండి సద్దాం, మౌలానా, చిన్న రామ్ రెడ్డి, నవీన్, నరేష్, గంగాధర్, హనుమండ్లు, రవి, జీవన్, చిలుకూరి వెంకటరెడ్డి, సురుకుంటి భోజరెడ్డి, నాందేవ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.












