మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన సభలు జరిగాయి. ఫామ్ పాండ్లు, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ల నిర్మాణంపై రైతులకు సూచనలు ఇస్తూ, వెంకటాపూర్ గ్రామంలో నిర్మాణ పనులు ప్రారంభించారు.
తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా, ముధోల్ మండలంలోని ఆష్ట, వెంకటాపూర్, రువ్వి, చింతకుంట గ్రామాలలో అవగాహన సభలు నిర్వహించబడ్డాయి. వెంకటాపూర్ గ్రామంలో బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ మార్కౌట్ ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగింది.
ఈ సమావేశాలలో ఫామ్ పాండ్లు మరియు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లు నిర్మించుకోవడానికి అర్హులైన రైతులను గుర్తించి, వారి నుండి అవసరమైన డేటాను సేకరించారు.
అదేవిధంగా, గ్రామాల్లో కమ్యూనిటీ సోక్ పిట్స్ మరియు డ్రైన్ ఎండ్-సోక్ పిట్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలను గుర్తించి, వాటి నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టే విషయమై గ్రామ సర్పంచ్లతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంఏఓ, ఏపీఓ, సంబంధిత క్లస్టర్ ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.












