Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులుగా సహజసిద్ధమైన ఎరువులతో సాగు చేస్తున్న రైతుల సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ సాగును మరింత ప్రోత్సహించాలని సూచించారు.
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులుగా సహజసిద్ధమైన ఎరువులతో సాగు చేస్తున్న రైతుల సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సేంద్రియ సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, రావుల రాంనాథ్, బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, రైతులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












