మిర్యాలగూడ, జులై 2
మిర్యాలగూడ డైమండ్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త లయన్ శ్రీనివాస్ మాశెట్టిని నియమిస్తూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మమత మారేపల్లి, రీజినల్ ప్రెసిడెంట్ కోట సరితలు ఈ నియామక ఉత్తర్వులను వెలువరించారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డైమండ్ స్వీట్స్ అండ్ బేకరీ సంస్థల వ్యవస్థాపకుడు లయన్ శ్రీనివాస్ మాశెట్టిని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ అధ్యక్షులుగా నియమిస్తూ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మమత మారేపల్లి, రీజినల్ ప్రెసిడెంట్ కోట సరితలు ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీనివాస్ మాశెట్టి ప్రస్తుతం హోటల్ యజమానుల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, డైమండ్ నేత్రినిధి వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నారు. వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ గా వివిధ రకాల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
గతంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు సంవత్సరాల పాటు 'మీల్స్ అండ్ వీల్స్' కార్యక్రమం ద్వారా రోగుల సహాయకులకు అల్పాహార వితరణను విజయవంతంగా చేపట్టారు. ఈ సేవలకు లయన్స్ క్లబ్ ద్వారా పలు అవార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నారు.
నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ "శ్రీనివాస్ డైమండ్" గా గుర్తింపు పొందిన ఆయన సేవలను గుర్తించి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ అధ్యక్షులుగా నియమించింది. పలువురు ఆయన నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా డైమండ్ శ్రీనివాస్ మాశెట్టి మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఫౌండర్ డాక్టర్ గంప నాగేశ్వరరావు, నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.వి. ఆర్., నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మమత, రీజినల్ ప్రెసిడెంట్ సరితలకు కృతజ్ఞతలు తెలిపారు.











