Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
మామడ మండలంలో కుక్కల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల గొర్రెల మందపై జరిగిన దాడుల్లో మొత్తం 22 గొర్రెలు మృతి చెందాయి. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ భరోసా ఇచ్చారు.
మామడ మండలంలో కుక్కల బెడద తీవ్రంగా మారింది. గత నెలలో మెకం అబ్బి గారి గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి 16 గొర్రెలను చంపాయి. తాజాగా, అదే మందలోని మరో 6 గొర్రెలను కుక్కలు దాడి చేసి చంపడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తగు చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని సర్పంచ్ శ్రీమతి పందిరి చంద్రకళ - సురేందర్ గారు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.












