కుబీర్, జూలై 23
భూగర్భ జలాల సంరక్షణ, పెంపుదలకు జలసిరి కార్యక్రమంలో భాగంగా నిర్మించే ఫామ్ పాండ్లు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం కుబీర్ మండలంలోని దోడర్న గ్రామంలో రైతు దంపతులు గోరేకర్ సంతోష్, సాగరల వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఫామ్ పాండ్ నిర్మాణానికి ముందుకొచ్చిన రైతు దంపతులను కలెక్టర్ శాలువాతో సన్మానించి అభినందించారు. వారి వ్యవసాయ పరిస్థితులు, సాగు విధానంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన పరిస్థితుల్లో వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్లు నిర్మించుకోవడం వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వం ఫామ్ పాండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నందున రైతులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం తెలంగాణ జలసిరి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను కలెక్టర్, అధికారులు, రైతులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, తహసీల్దార్ శ్రీదేవి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ జాదవ్ సావిత్రి, ఇతర అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.