పెబ్బేరు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
వనపర్తి జిల్లా మండలం చెంచువాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న డి. చిన్న రాములు 2026 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా ఆయనకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిన్న రాములుకు రావుల అభినందనలు వనపర్తి జిల్లా, మండలం చెంచువాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న డి. చిన్న రాములు 2026 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడంతో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి చరవాణి ద్వారా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చిన్న రాములు చేసిన కృషి అభినందనీయమని రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు, దాతల సహకారంతో పాఠశాలకు అవసరమైన భౌతిక వసతులను సమకూర్చేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. చిన్న రాములు సేవలను గుర్తించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలంటే చిన్న రాములు వంటి ఉపాధ్యాయుల సేవలు, అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజలు, దాతలు, విద్యాభిమానులు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. 2026 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన డి. చిన్న రాములుకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.












