నాగిరెడ్డిపేట్, 4 September
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నిరసనలో భాగంగా విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన లో విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ మాజీ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ తదితర డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. న శనివారం ఉదయం 11 గంటలకు పట్టణ కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మనోహర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.












