కృష్ణుడి లీలలతో చిన్నారుల సందడి వాసవి పాఠశాలలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు బోథ్: మండలం (మనోరంజని తెలుగు టైమ్స్) కేంద్రంలోని వాసవి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో హాజరై సందడి చేశారు. చిన్నికృష్ణుడి వేషధారణలో బాలురు, గోపికల వేషాల్లో బాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి గంగయ్య మాట్లాడుతూ.. జన్మాష్టమి మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే పవిత్రమైన పర్వదినమన్నారు. దేవకీ, వాసుదేవులకు అష్టమి తిథి అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడని, బాల్యంలోనే పూతన సంహారం, గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను, గోవులను రక్షించడం వంటి గొప్ప కార్యాలు చేశాడని వివరించారు. గోపబాలురతో కలిసి వెన్న దొంగిలించిన శ్రీకృష్ణుడి బాల్యలీలల్లో ప్రేమ, స్నేహం, ఐక్యత వంటి విలువలు దాగి ఉన్నాయని తెలిపారు. కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీతను బోధించడం ద్వారా మానవాళికి ధర్మమార్గాన్ని చూపించాడన్నారు. ధర్మం క్షీణించినప్పుడు దాన్ని కాపాడేందుకు అవతరిస్తానన్న శ్రీకృష్ణుడి సందేశం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు సంప్రదాయ వేషధారణలతో పాల్గొని, కృష్ణుడి లీలలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో వేడుకల సందడి నెలకొంది.
కృష్ణుడి లీలలతో చిన్నారుల సందడి
Share:

సారాంశం
కృష్ణుడు, గోపికల వేషధారణలో విద్యార్థులు సందడి
ముఖ్య విషయాలు
- చిన్నికృష్ణుడి వేషధారణలో బాలురు, గోపికల వేషాల్లో బాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- జన్మాష్టమి మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే పవిత్రమైన పర్వదినమన్నారు.
- గోపబాలురతో కలిసి వెన్న దొంగిలించిన శ్రీకృష్ణుడి బాల్యలీలల్లో ప్రేమ, స్నేహం, ఐక్యత వంటి విలువలు దాగి ఉన్నాయని తెలిపారు.
- కృష్ణుడి లీలలతో చిన్నారుల సందడి వాసవి పాఠశాలలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు బోథ్: మండలం (మనోరంజని తెలుగు టైమ్స్) కేంద్రంలోని వాసవి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3283ఆర్టికల్స్
4,05,378వ్యూస్










