** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
బోథ్ మండలం, రేండ్లపల్లి గ్రామానికి చెందిన మాడవి లలిత - కోశేరావు దంపతులు 15 ఏళ్ల ఉపాధ్యాయ సేవ తర్వాత ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సర్పంచ్ అడప నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. న్యాయవాది పంద్రం శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బోథ్ మండలం, రేండ్లపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన మాడవి లలిత - కోశేరావు దంపతులను గ్రామస్తులు, గ్రామపంచాయతీ సర్పంచ్ అడప నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ... ఉపాధ్యాయ వృత్తిలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, ఆరోగ్య సమస్యలు వెంటాడినా కోశేరావు మాస్టారు తన వృత్తిని దైవంగా భావించి విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ విద్యాబుద్ధులు నేర్పించారని కొనియాడారు. "ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కోశేరావు గారే ముఖ్య మార్గదర్శకులు" అని పేర్కొన్నారు.
వారు విద్యార్థుల అభ్యున్నతికి, గ్రామానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు ప్రశంసించారు. ఉద్యోగ విరమణ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, ప్లేట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నక్కలవాడ సర్పంచ్ అడప నవీన్ కుమార్, పట్నాపూర్ సర్పంచ్ పంద్రం సుగుణ, పటేల్ ఆత్రం సహాదేవ్, మాడవి మనోహర్, ఉప సర్పంచ్ మాడవి నాగోరావ్, తోడసం విజయ్ కుమార్, పూజారి సిడం జంగు, మహాజన్ రాయి సిడం కోశేరావు, రోహిదాస్, బీర్షవ్, మధుకర్ మరియు గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








