ఖానాపూర్, జూలై 31
ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే రావలసిన బకాయిలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బన్సపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

ఒక ఉద్యోగి తన పదవీ కాలంలో క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జీతంపై ఆధారపడిన వారికి పదవీ విరమణ తర్వాత పెన్షన్‌పై జీవించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఉద్యోగులు పూర్తి జీతం ఉన్నప్పుడు ఇల్లు నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువులకు రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నారని, రిటైర్మెంట్ తర్వాత సగం జీతంతో ఈఎంఐలు, పోషణ ఎలా వెళ్ళదీస్తారని ఆయన ప్రశ్నించారు.
కనుక రిటైర్మెంట్ కాగానే తొందరగా రావాల్సిన బకాయిలు చెల్లిస్తే ఎలాంటి ఆందోళన లేకుండా జీవించగలరని అన్నారు. ప్రస్తుతము ప్రభుత్వం ఉద్యోగులకు రావలసిన డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు హెచ్ ఎస్ కార్డులు తొందరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి వెంకటేశ్వరరావు, పట్టణ బాధ్యులు ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.