నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామ గార్డెన్లో యు.వి. కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల డైరెక్టర్ డి. సృజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి ముఖ్య అతిథిగా, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాల సాధనపై సూచనలు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామ గార్డెన్లో యు.వి. కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డి. సృజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి ముఖ్య అతిథిగా, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ, యు.వి. కళాశాలలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా హోటల్ మేనేజ్మెంట్తో పాటు ఇతర కోర్సుల్లో చేరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 290 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. కళాశాల అందిస్తున్న నాణ్యమైన శిక్షణను సద్వినియోగం చేసుకుని దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
కళాశాల డైరెక్టర్ డి. సృజన్ కుమార్ సేవలను విఠల్రావు ప్రత్యేకంగా కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చైర్మన్గా ఉన్న సమయంలో యు.వి. ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1.20 కోట్ల విలువైన ఆక్సిజన్ కిట్లు ఆసుపత్రికి అందజేసి విశేష సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్యక్రమంలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ జన్మదినం, భారతి అమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు కొత్తగా చేరిన విద్యార్థుల కోసం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి, ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువత సంక్షేమ అధికారి పవన్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ చైతన్య, రెడ్ క్రాస్ చైర్మన్ పూస ఆంజనేయులు, రిటైర్డ్ పి. డి ఉమా మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఆదివాసీ న్యాకపోడు సంఘం అధ్యక్షులు గాండ్ల, రాంచంధర్ (రిటైర్డ్ టీచర్), యు వి కళాశాల మేనేజ్మెంట్ బి. అర్చన, వ్యాఖ్యత ఇందురు యువత అధ్యక్షులు సాయి బాబా, కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


