Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 07
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో ఎంపిఓ అజీజ్ ఖాన్ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్వర్ణ గ్రామంలో మొక్కలను పంపిణీ చేశారు.
ప్రతి ఇంటిలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎంపిఓ అజీజ్ ఖాన్ అన్నారు. మంగళవారం మండలంలోని స్వర్ణ గ్రామంలో గ్రామ సర్పంచ్‌తో కలిసి ఆయన మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందిస్తేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించగలమని తెలిపారు.
అనంతరం బోరిగామ్ గ్రామంలో ఓటరు ఎస్.ఐ.ఆర్ ఫారాల స్వీకరణను పరిశీలించారు. రవీంద్రనగర్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు కొత్తింటి మల్లేష్, జాదవ్ దిలీప్, బొబ్బిలి గోదావరి గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.












